యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుస్తున్న ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను జిరాక్స్ సెంటర్లలో అధిక ధరలకు విక్రయించడాన్ని నియంత్రించేందుకు ఆలేరు పట్టణంలో తాహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్సై వెంకట శ్రీను ఆకస్మిక తనిఖీలను చేపట్టారు.స్థానిక జిరాక్స్ యాజమాన్లకు అధిక ధరలకు జీరాక్సులు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.