అమావాస్య రోజు ఇలాంటి పనులు చేస్తే శని దేవుణ్ణి ఉగ్రరూపం చూస్తారా..

మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.వీటన్నిటికీ మించి కొందరు కుటుంబాలలో శని వల్ల ఎన్నో ఇబ్బందులను చాలామంది శని దేవుని పేరు వినగానే భయపడి పోతూ ఉంటారు.

 If You Do Such Things On The Day Of Amavasya, Will You See Lord Shani Angry , Am-TeluguStop.com

మరి కొంతమంది బాగా నమ్మేవారు అమావాస్య రోజు కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తూ ఉంటారు.మరి కొంతమంది మాత్రం ఎటువంటి భయం లేకుండా శనీశ్వరునికి ఇష్టమైన విధంగా పూజలు చేస్తూ శనీశ్వరునికీ ఇష్టమైన వస్తువులను ఆహారాలను దానం చేస్తూ ఉంటే మంచిది.

పురాణా శాస్త్రం ప్రకారం శని దేవునికి కోపం ఎక్కువ అని చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు.శని దేవుడి అనుగ్రహం పొందిన వారు రాజభోగాలను అనుభవిస్తారు.

అలాగే శని ఆగ్రహానికి గురైన వాళ్ళు అష్ట కష్టాలను అనుభవిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు.అయితే కొందరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాలు పడుతుంటారు.

రాత్రి సమయంలో త్వరగా పడుకోకుండా అర్ధ రాత్రి వరకు జాగరణ చేసేవారన్న,చాలా పొద్దుపోయిన తర్వాత నిద్రలేచేవారన్నా కూడా శని దేవుడికి చాలా కోపం అని చాలామంది ప్రజల నమ్మకం.అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించని వారి పైన కూడా శని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.

ఎప్పుడు ఇతరుల సొమ్ము కోసం ఆశపడే వారిని ఆ శని దేవుడు ఆగ్రహిస్తాడని పురాణాల ప్రకారం పెద్దలు చెబుతూ ఉంటారు.వీటితో పాటుగా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే వారిపై కూడా శని దేవుడు ఆగ్రహం చూపిస్తూ ఉంటారు.

ఇకపోతే అమావాస్య సమయంలో కొందరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుని ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే అమావాస్య రోజున మాంసం, మద్యపానం తీసుకునే వారిపై శని దేవుడు ఆగ్రహాన్ని ఎక్కువగా చూపిస్తాడని పురాణాల ప్రకారం పెద్దవారు నమ్ముతారు.

అలాగే ఇంట్లో పని చేసే పని వాళ్లపై పెత్తనం చెలాయించే యజమానులపై కూడా శని దేవుడు ఆగ్రహాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube