పూజ గదిలో ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. జీవితంలో..!

హిందూ ధర్మంలో ప్రతి రోజు దేవుడుని పూజించాలన్న నియమా నిబంధనలు ఉన్నాయి.భగవంతుడు నివసించని ఏ కనుమ కూడా ఈ ప్రపంచంలో ఉండదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

భగవంతుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూలత లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.దాదాపు చాలా మంది ప్రజలు తమ ఇంట్లో దేవుడిని ఆరాధించడానికి ఒక పూజ గది( Pooja-room )ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

పూజ గదిలో ఇంట్లో సానుకూల శక్తినీ ప్రసారం చేస్తుంది.మనం పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.కానీ మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం.పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి.

ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.స్నానం చేయకుండా పూజ గదిలోకి అసలు వెళ్లకూడదు.

ఉదయం, సాయంత్రం పూజ గదిలో దీపాలు వెలిగించాలి.గంటా, శంఖము( Conch ) కచ్చితంగా మోగించాలి.

హిందూ మతంలో ఏ పూజ చేసిన సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే ఏదైనా శుభకార్యం మొదలుపెడతారు.అందుకే పూజ మందిరంలో వినాయకుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి.ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.వినాయకుడు కూర్చున్నట్లు ఉన్న విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పూజ గదిలో ఉంచాలి.వాడిపోయిన రోజుల, తరబడి ఉంచిన పువ్వులను పూజకు అస్సలు ఉంచకూడదు.

పూజ గదిలో శివలింగాన్ని ఉంచినట్లయితే శివలింగ పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవడం మంచిది.పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు.మీ పూర్వీకుల ఫోటోలు దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

హిందూ గ్రంధాల ప్రకారం శని దేవుడు, కాళీమాత( kali matha ) భైరవబాబా చిత్రపటాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.ఈ దేవుళ్ళ విగ్రహాలను ఇంట్లోనే పూజ గదిలో ఉంచినట్లయితే మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube