గత కొంతకాలంగా పాకిస్తాన్ ( Pakistan ) వేదికగా జరిగే ఆసియా కప్( Asia Cup ) వివాదం ఎన్నో చర్చలు జరిగాక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్లో జరిగే భారత మ్యాచ్ లకు శ్రీలంక, దుబాయ్, ఒమన్ లలో ఏదో ఒక వేదికపై భారత మ్యాచులు జరిపేందుకు పాకిస్తాన్ అంగీకరించింది.
ఇక భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో( One Day Worldcup ) తెరపైకి ఓ కొత్త సమస్యను తెచ్చింది పాకిస్తాన్ బోర్డు. అదేమిటంటే తమ దేశంలో జరిగే మ్యాచ్ లకు భారత్ కోసం తటస్థ వేదికలు ఏర్పాటు చేసినట్లు, భారత్లో జరిగే మ్యాచ్ల విషయంలో తమకు కూడా వేరే తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని ఐసీసీకి ( ICC ) లేఖ రాసింది.
ఎట్టి పరిస్థితులలో కూడా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ కు రామని తేల్చి చెప్పేసింది.తమకు కూడా భారత్ లాగే తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని పట్టుబడుతూ ఐసీసీకి మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.
తమ కోసం ప్రత్యేకంగా బంగ్లాదేశ్ వేదిక అయితే మ్యాచ్లు ఆడతామని ఐసీసీకి రాసిన లేఖలో పీసీబీ పేర్కొంది.

కానీ పాకిస్తాన్ కోసం తటస్థ వేదిక ఏర్పాటు చేయడం లో ఐసీసీ తో పాటు బీసీసీఐకి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.కాబట్టి వివిధ దేశాలు ఆడే టోర్నీని కేవలం ఒక్క దేశం కోసం వేదికలను మార్చడం చాలా కష్టం అని ఐసీసీ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ విషయం లో పాకిస్తాన్ లో చర్చకు దారితీసింది.

ఆసియా కప్ విషయంలో భారత్ కు తటస్థ వేదికలు ఏర్పాటు చేయడం పీసీబీ బోర్డు అంగీకరించకుండా ఉంటే బాగుండేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ఇదే అదునుగా చూసుకుని భారత్ ను ఇరకాటంలో పెట్టాలని పాకిస్తాన్ బోర్డు ప్రయత్నిస్తోంది.ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ చర్చలు జరుపుతోంది.







