ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి రోజు ధన త్రయోదశి( Dhana Trayodasi ) పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం ఈ ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన జరుపుకొనున్నారు.
ఈ రోజు ధన్వంతరికి అంకితం చేయబడింది అని నిపుణులు చెబుతున్నారు.ఈ ధన్వంతరి విష్ణుమూర్తి అవతారం అని కూడా చెబుతున్నారు.
అయితే ధన త్రయోదశి రోజు ధన్వంతరి స్వామి( Dhanvantari Swamy ) దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు.
అలాగే లక్ష్మీదేవిని కూడా నియమా నిష్టతో పూజిస్తారు.అమ్మవారి ఆశీస్సులు ఉంటే జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు.
అయితే ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులను కొంటే ఆదాయం, అదృష్టం పెరుగుతాయని కూడా చాలామంది ప్రజలు నమ్ముతారు.
మరి ఆ వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మీరు ఉప్పును( Salt ) కూడా కొనుగోలు చేయవచ్చు.ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.
మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ధన త్రయోదశి రోజు ఉప్పు కొని మీ ఇంటికి తీసుకురావాలి.ధన త్రయోదశి రోజు ఉప్పును కొనడం వల్ల మీ ఆదాయం, అదృష్టం రెండూ పెరుగుతాయి.
ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు చీపురును( Broom ) కొనాలనే నియమం కూడా ఉంది.
ఎందుకంటే వీటిని కూడా శుభప్రదంగా భావిస్తారు.అందుకే ధన త్రయోదశి రోజు చీపుర్లు కొనడం మంచిది.ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ( Lakshmidevi ) వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది.
ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు గోమతి చక్రాన్ని కొనడం కూడా మంచిదని చెబుతున్నారు.ఇలా కొనడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.అలాగే దీన్ని పూజ గదిలో పెట్టి పూజించాలి.ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది.
కొత్తిమీర లేదా ధనియాలను కొనడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల మీ ఇల్లు సిరి సంపదలతో వెల్లి విరుస్తుంది.