మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు గట్టిగా నమ్ముతారు.ఎందుకంటే ప్రకృతిలోనీ పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలను వాస్తు రూపకల్పనను సమతుల్యం చేసే పురాతన వేద అభ్యాసం అని చెబుతూ ఉంటారు.
ఇల్లు, ఆఫీసులో వంటి వాటి నిర్మాణాలను చేసే సమయంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించుకోవడం వల్ల శుభం జరుగుతుంది అని చాలామంది ప్రజలు నమ్ముతారు.సాధారణంగా చెప్పాలంటే ఇంటిని నిర్మించే ముందు వాసు శాస్త్రవేత్తలను సంప్రదిస్తూ ఉంటారు.
అంతే కాదు ఇంటిలో ఏర్పాటు చేసుకునే అలంకార వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రం అనుసరిస్తూ ఉంటారు.ఇంటిలో వాస్తు శాస్త్ర పద్ధతులను చేర్చడం వల్ల ఇంటి సమతుల్యతను పాజిటివ్ ఎనర్జీ మెరుగుపరుస్తుందని చెబుతూ ఉంటారు.ఇంట్లో లేదా ఆఫీస్ లో వాడిన పుష్పాలను అలంకరిస్తే అవి ఇంటి సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని చెబుతూ ఉంటారు.అయితే తాజా పువ్వులను ఇంట్లో ఏర్పాటు చేసి తరచూ తరచుగా మారుస్తూ ఉంటే సానుకూల శక్తిని పెంచుతాయి.
అదే సమయంలో ఇంట్లో వాడినా లేదా ఎండిన పూలను అందం కోసం ఇంట్లో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం.
భారతీయ సంస్కృతిలో ఎండిన పువ్వులను మృత దేహాలతో పోలుస్తారు.కాబట్టి ఎండిన పూలు ఇంట్లో ఉంటే వీటిని ఇంటి నుండి బయట పడేయడం మంచిది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి అందాన్ని మంచి సువాసన తీసుకొని వచ్చే పువ్వులు ఎండితే వాటిని విషంగా భావిస్తారు.ఇలా చేయడం వల్ల కొత్త చిక్కులు తీసుకొని వస్తాయి.
వాస్తు శాస్త్ర ప్రకారం నిర్జీవంగా ఉన్న ప్లాస్టిక్ మొక్కలు, వాడిపోయిన పువ్వులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అని చెబుతున్నారు.అంటే ఇలా చేయడం వల్ల ఇంటి కుటుంబ సభ్యుల పురోగతి సాధిస్తారు.