క‌రోనాకు చెక్ పెట్టే జింక్‌..ఏ ఏ ఆహారాల ద్వారా ల‌భిస్తుందంటే?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారిని కట్ట‌డి చేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే ఉన్నాయి.

 Zinc Rich Foods To Boost Immunity Power! Zinc Rich Foods, Immunity Power, Zinc,-TeluguStop.com

దాంతో ఆర్థిక న‌ష్ట‌మే కాదు ప్రాణ న‌ష్టం కూడా తీవ్రంగా వాటిల్లుతుంది.వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ క‌రోనా వేగంలో జోరు త‌గ్గడం లేదంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే క‌రోనా వ‌చ్చినా ఏం కాదులే!, వ్యాక్సిన్ వేసుకుంటే పోతుందిలే! అన్న అపోహ‌ల ప‌క్క‌న పెట్టి ఎవ‌రి జాగ్ర‌త్త‌ల్లో వారు ఉండాల్సి ఉంటుంది.ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవాలి.

అయితే ఈ మ‌ధ్య విట‌మిన్ సి ఉండే ఆహారాలు తీసుకోవాల‌ని త‌ర‌చూ చెబుతున్నారు. విట‌మిన్ సి మ‌న శ‌రీరంలో ఉండే క‌ణాల‌ను బ‌లంగా మారుస్తుంది.దాంతో వైర‌స్ వ‌చ్చినా బ‌ల‌మైన క‌ణాలు దానిని తిప్ప‌కొడ‌తాయి.అందుకే విట‌మిన్ సి ఫుడ్ తీసుకోమంటున్నారు.

అయితే విట‌మిన్ సి లాగానే జింగ్ కూడా క‌రోనాకు చెక్ పెట్ట‌డంలో ఉప‌యోగ‌పడుతుంది.

అందుకే జింక్ కూడా శ‌రీరానికి పుష్క‌లంగా అందేలా చూసుకోవాలి.

అలా అని జింక్ టాబ్లెట్స్‌ వేసుకోవ‌డం కాదు ఆహారం ద్వారానే తీసుకోవాలి.మ‌రి జింక్ ఏ ఏ ఆహారాల ద్వారా ల‌భిస్తుంది అన్న‌ది కూడా చూసేయండి.

పుచ్చ గింజ‌ల్లో జింక్ స‌మృద్దిగా ఉంటుంది.అయితే పుచ్చ‌కాయ తినేట‌ప్పుడు గింజ‌ల‌ను పారేస్తారు.

కానీ, గింజ‌ల‌ను కూడా తింటే మీకు జింక్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

Telugu Corona, Covid, Tips, Immunity, Latest, Zinc, Zinc Rich Foods-Telugu Healt

బఠానీలు, బీన్స్, గోధుమలు, శెన‌గ‌లు, గుమ్మ‌డి గింజ‌లు జింక్‌కు మంచి వనరులు. అలాగే ప‌ల్లీలు, జీడి ప‌ప్పు, పిస్తా ప‌ప్పు, బాదం ప‌ప్పు కోడిగ‌డ్డు, పాలు, పెరుగు, డార్క్ చాకొలెట్స్‌, ఓట్స్‌, చికెన్‌, మ‌ట‌న్‌, నువ్వులు వంటి వాటిలో కూడా జింక్ పుష్ప‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

దాంతో క‌రోనాకు దూరంగా ఉండొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube