స్నాన భేదాలు ఎన్ని రకాలు? అవి ఏవో తెలుసా?

మనకు స్నానం గురించి తెలుసు కానీ అందులో ఉండే రకాల గురించి చాలా వరకు తెలియదు.అయితే స్నాన భేదాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Do You Know About Snana Bedhalu , Devotional, Snana Bedalu, Snana Rakalu, Telugu-TeluguStop.com

ముఖ్యంగా  స్నానాన్నే వారుణ స్నానం అంటారు.ఇది ఆరు రకాలు.

అందులో మొదటిది నిత్యం.ప్రతిరోజూ ప్రాతః కాలమున చేసే స్నానం.

రెండోది మైమిత్తికము – మృతాశౌచాదుల సందర్భంలో చేసేది.అలాగే మూడోది కామ్యము.

ప్రత్యేకమైన కోరికతో కార్తీక, మాఘ మాస సాదులందు చేసేది.

అలాగే నాలుగోది క్రియాంగం.

దేవతా పూజ, జపం, వ్రతం, తిథి కార్యం మొదలగు వాటి ప్రారంభానికి ముందు చేసే స్నానాన్ని క్రియాంగం స్నానం అంటారు.ఇక ఐదోది మలాపకర్షణము.

పండుగ రోజుల్లో తలంటుకొని, నలుగు పిండి పెట్టుకొని చేసే అభ్యంగన స్నానం.అలాగే క్రియా స్నానము.

సరస్సు, పుష్కరిణి, నదీ తీరము లందు చేసే స్నానాన్ని క్రియా స్నానం అంటారు.ఇలా మనం చేసే ప్రతీ ఒక స్నానానికి ఒక కథ ఉంది.

అయితే ఈ స్నాన భేదాల గురించి చాలా మందికి తెలియదు.వీటి గురించి పూర్తిగా తెలుసు కుని స్నానం ఆచరిస్తే చాలా మంచి దని వేద పండితులు సూచిస్తున్నారు.

హిందువులుగా పుట్టిన మనమంతా మన పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు… వాటి వెనుక ఉన్న అర్థాల గురించి తెలుసు కుంటే చాలా మంచిది.మనం ఇవన్నీ తెలుసుకొని జ్ఞానం పొందడమే కాకుండా మన తోటి వారికి, భవిష్యత్తు తరాలకు కూడా జ్ఞానాన్ని అందించడం మరింత ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube