ఉలవలు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
మన దేశంలో విరివిగా వాడే ధాన్యాల్లో ఉలవలు కూడా ఒకటి.ముఖ్యంగా ఉలవలతో తరాయు చేసే చారు, ఉలవ గుగ్గిళ్ళను తెలుగు వారు అమితంగా ఇష్టపడాతరు.
అయితే రుచిలోనే కాదు.శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలోనూ.
ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ గ్రేట్‌గా సహాయపడతాయి.మరి ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.నేటి కాలంలో వయసులో సంబంధం లేకుండా అధిక బరువు సమస్యను కామన్‌గా ఫేస్ చేస్తున్నారు.అయితే అలాంటి ప్రతి రోజు ఉదయాన్నే ఉడికించిన ఉలవలను తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ క్రమంగా కరుగుతుందని.
తద్వారా అధిక బరువు అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.ఉలవలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉంటాయి.కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా సజావుగా జరుగుతుంది.
అదే సమయంలో రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.అలాగే ఉలవల్లో ఐరన్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి, రక్త హీనత ఉన్న వారు వీటిని డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాలలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఉలవలకు ఉంది.ఇక లైంగిక సమస్యలతో ఇబ్బంది పడే మగవారికి ఉలవలు బెస్ట్ అప్షన్.ఉలవలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.అలాగే ఈ సీజన్ చాలా మంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఎక్కువగా బాధ పడుతుంటారు.
అయితే అలాంటి వారు ఉలవల కషాయం తాగితే.సులువుగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.