ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మం ప్రకారం మార్గ శీర్ష శుక్ల పంచమిని వివాహ పంచమి( Vivah Panchami ) అని పిలుస్తారు.క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వివాహ పంచమి డిసెంబర్ నెల 17వ తేదీన వచ్చింది.
వివాహ పంచమికి పురాణ గ్రంథాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే త్రేతా యుగంలో మార్గ శీర్ష శుక్ల పంచమి తిధి రోజున శ్రీరాముడు, సీతా మాత వివాహం జరిగింది.ఈ రోజున దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.2023వ సంవత్సరంలో వివాహ పంచమి డిసెంబర్ 17వ తేదీన శుభ ముహూర్తం లో చేయాల్సిన పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే పంచాంగం ప్రకారం మార్గ శీర్ష మాసంలోని శుక్ల పక్ష పంచమి తిది డిసెంబర్ 16వ తేదీన రాత్రి 8 గంటల నుంచి మొదలవుతుంది.అయితే ఈ తేదీ డిసెంబర్ 17వ తేదీన సాయంత్రం 5:33 నిమిషములకు ముగుస్తుంది.అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి నమ్మకం ప్రకారం వివాహ పంచమి డిసెంబర్ 17వ తేదీన జరుపుకుంటారు.అలాగే వివాహ పంచమికి సంబంధించిన విశేషం ఏమిటంటే డిసెంబర్ 16 వ తేదీన సూర్యుడు మకర మకర రాశి నుంచి ధనస్సు రాశి లోకి ప్రవేశిస్తాడు.
అలాంటప్పుడు పంచమి ఘడియల్లోనే కళ్యాణం జరుపుకుంటారు.అలాగే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంటారు.
వివాహ పంచాంగం 2023లో శుభ యోగం ఎప్పుడంటే జ్యోతిష శాస్త్రం( Astrology ) ప్రకారం వివాహ పంచమి రోజున హర్ష యోగం ఏర్పడబోతోంది.అలాగే వివాహ పంచమి రోజు ఈ శుభ యోగం రోజంతా ఉంటుంది.డిసెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12:30 నిమిషముల వరకు హర్ష యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఈ పవిత్ర యోగంలో భగవంతుడు శ్రీరాముడి( Lord rama )ని మాత జానకిని పూజించడం వల్ల విశేష పూజ ప్రయోజనాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.