సూర్యాపేట జిల్లా:గత నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్( Cyclone Michaung ) ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్ట నష్టం జరుగిందని, ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయు( Veeranjaneyulu )లు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వరి,పత్తి,మిర్చి, బంతి పంటలు తుఫాన్ వల్ల దెబ్బతిన్నాయని, వెంటనే ప్రభుత్వం, అధికారులు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తుఫాను రైతుల్ని దెబ్బతీసిందని కొత్త ప్రభుత్వం వెంటనే రైతుల్ని ఆదుకోవటానికి చర్యలు చేపట్టాలని,నష్టపోయిన రైతులకి కనీసం ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో వరి,పత్తి సాగుచేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రైతులు అదునుగా వరి నాట్లు వేయటంతో పాటు ఎక్కువగా ఎక్కువ మొత్తం పత్తి పంట సాగు చేశారని అన్నారు.వరిచెలు పొట్ట దశలో పత్తి చేలు పూత కాయ కాస్తున్న సమయంలో వర్షాలు కురవటం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతుల్ని వెంటాడుతున్న తుఫాన్ జిల్లాలో రైతులను ఈ ఏడాది తుఫాను ప్రభావంతో వర్షం కురవడంతో వరి పంట చాలా చోట్ల నేలపాలైందని వాపోయారు.
ప్రభుత్వం, అధికారులు వరి ధాన్యాన్ని( Rice grain ) మార్కెట్ గిడ్డింగులలో భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని,రైతులకు సంబంధించిన అవసరాలని అధికారులు వెంటనే చేపట్టాలని, లేకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిఅప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు.
పంట నష్టంపై అధికారులు సర్వే నెంబర్ ఆధారంగా సర్వే చేసి ఎకరానికి 50,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.లేని ఎడల రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.