2021 సంవత్సరంలో పుష్ప ది రైజ్ సినిమా తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు అఖండ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఫుల్ రన్ లో ఏకంగా 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు సాధించింది.
బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ మొత్తం లాభాలను అందించిన సినిమాగా ఈ సినిమా నిలవడం గమనార్హం.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా అఖండ సినిమా లాంటి పాయింట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
సలార్ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.అయితే అఖండ సినిమాలో ఉన్న విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఈ సినిమాలో డివోషనల్ టచ్ ఉంటే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.కేజీఎఫ్2 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలకు కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

సలార్ క్లైమాక్స్ కూడా డివోషనల్ టచ్ తో ఉంటుందని తెలుస్తోంది.శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.సలార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
సలార్ సినిమా హోమబుల్ ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.సలార్ సినిమాతో ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నా ఆ సినిమాలకు నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
కెరీర్ విషయంలో ప్రభాస్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.