భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని తెలిపారు.

 Telangana Symbol Of Unity In Diversity: Minister Jagadish Reddy , Jagadish Reddy-TeluguStop.com

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఈద్గాలో జరిగిన ప్రార్ధనలో మంత్రి పాల్గొని,ముస్లిం సోదరులతో అలాయ్ బాలయ్ తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో నెల రోజులుగా కఠోరమైన దీక్ష చేపట్టి రంజాన్ పర్వదినం రోజున విడిచి భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సమాజానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

యావత్ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాంతిసామరస్యాలు పరిఢ విల్లాలన్న సంకల్పంతో నెల రోజులుగా కఠోర దీక్షలకు, ప్రార్ధనలకు అల్లాయే మోక్షం కలిగిస్తారన్న విశ్వాసం ఉందన్నారు.

సర్వమత ఆచార వ్యవహారాలను గౌరవించడంలో తెలంగాణా ప్రత్యేకతను చాటుకుందన్నారు.బతుకమ్మ,రంజాన్,క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జడ్ పి వైస్ చైర్మన్ వెంకట నారాయణ,జడ్ పి టి సి జీడీ భిక్షం,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్,బి.

ఆర్.ఎస్ నేత వై.వి.తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube