వంటగ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి:మట్టిపెళ్ళి సైదులు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్ళి సైదులు బుధవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎనిమిదేళ్ల క్రితం రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా రూ.1160 లకు పెరిగిందన్నారు.దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానం చూస్తుంటే మహిళలను మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేయించి కన్నీరు తెచ్చేలా ఉందనన్నారు.ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో అధిక ధరకు వంట గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటని విమర్శించారు.

 Cooking Gas Price Should Be Withdrawn Mattipelli Sidhu , Mattipelli Sidhu, Cooki-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమాలలో పేద, మధ్యతరగతి ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube