వంటగ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి:మట్టిపెళ్ళి సైదులు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్ళి సైదులు బుధవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎనిమిదేళ్ల క్రితం రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా రూ.

1160 లకు పెరిగిందన్నారు.దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానం చూస్తుంటే మహిళలను మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేయించి కన్నీరు తెచ్చేలా ఉందనన్నారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో అధిక ధరకు వంట గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమాలలో పేద, మధ్యతరగతి ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !