నల్లగొండ జిల్లా:భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు,సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
భూ భారతి పోర్టల్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఈ పోర్టల్ పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.