అందమైన, మృదువైన పాదాలు కావాలని అందరూ ఆరాటపడుతుంటారు.కానీ, ప్రస్తుత చలి కాలంలో అది కాస్త అసాధ్యంగానే ఉంటుంది.
అయినప్పటికీ మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల ప్రోడక్ట్స్‌ను యూజ్ చేస్తూ పాదాలను కోమలంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అందమైన, మృదువైన పాదాలను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్డులోని పచ్చ సొనను మాత్రం వేసుకోవాలి.
అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ బంగాళదుంప పేస్ట్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.
డ్రై అయిన తర్వాత స్మూత్‌గా రబ్ చేసుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే గనుక డెడ్ స్కిన్ సెల్స్, డస్ట్ వంటివి పోయి పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.
అలాగే మరో విధంగా కూడా పాదాలను మృదువుగా మార్చుకోవచ్చు.ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, రెండు కప్పుల క్యాబేజీ ముక్కలు, ఉడికించిన బంగాళ దుంప ఒకటి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో నాలుగు స్పూన్ల బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెండు కవర్లు తీసుకుని అందులో తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమానంగా నింపుకోవాలి.ఆపై పాదాలను కవర్స్‌లో పెట్టి కనీసం గంట పాటు ఉండాలి.అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గు ముఖం పడతాయి.
పాదాలు కోమలంగా, అందంగా మారతాయి.