నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 51 రోజులైనా టెన్నెల్ లోనే ఇంకా ఆరుగురి మృతదేహాలు ఉండగా 50 రోజుల్లో కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్ ఉండగా డేంజర్ జోన్ లో సహాయక చర్యలు చేపడితే మరింత డేంజర్ అని భావిస్తున్నారు.రెస్క్యూ టీంలు 51 రోజులుగా నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టాయి.51 రోజులైనా తమ వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.







