సూర్యాపేట జిల్లా:నల్లగొండ పట్టణంలోని మణికంఠ ల్యాబ్ నిర్వాహకుడు సురేష్ ను దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేపూరి లక్ష్మణ్,రాష్ట్ర సభ్యులు రామిశెట్టి కృష్ణ డిమాండ్ చేశారు.సురేష్ హత్యను ఖండిస్తూ హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
హత్యకు గురైన సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి లక్ష్మణ్,భాస్కర్,చారి,శ్రీకాంత్,జక్కుల మురళి,జడ సాయి,నాగేంద్రబాబు,నరసింహారావు,వెంకన్న తదితరులు పాల్గొని సురేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.