మామిడి ఆకులు( Mango Leaves ). సాధారణంగా వీటిని ఇంటికి తోరణంగా కట్టడానికి ఉపయోగిస్తుంటారు.
అయితే అందుకు మాత్రమే మామిడి ఆకులు ఉపయోగపడతాయి అనుకుంటే పొరపాటే అవుతుంది.మామిడి ఆకుల్లో ఎన్నో విలువైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే ఆయుర్వేద వైద్యంలో మామిడి ఆకులను వినియోగిస్తుంటారు.ముఖ్యంగా జుట్టు సంరక్షణకు మామిడి ఆకులు అండగా నిలుస్తాయి.
ఇటీవల రోజుల్లో ఎంతో మంది తెల్ల జుట్టు సమస్యతో సతమతం అవుతున్నారు.అలాంటి వారికి మామిడి ఆకులు ఒక వరం అనే చెప్పుకోవచ్చు.

తెల్ల జుట్టు( Grey Hair )ను నల్లగా మార్చడానికి మావిడాకులు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంతకీ వీటిని ఎలా వాడాలి అన్నది తెలుసుకుందాం పదండి.ముందుగా వాటర్ తో కడిగిన కొన్ని మామిడి ఆకులు తీసుకుని ఎండలో పెట్టాలి.బాగా ఎండిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మామిడి ఆకుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పొడి( Henna Powder ) వేసుకోవాలి.
అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై మూత పెట్టి గంటపాటు వదిలేయాలి.అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ విధంగా చేస్తే మీ తెల్ల జుట్టు సహజంగానే నల్లబడుతుంది. వైట్ హెయిర్( White Hair ) ను నివారించడానికి ఇది అద్భుతమైన రెమెడీగా చెప్పుకోవచ్చు.
పైగా ఈ రెమెడీ వల్ల జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.