సూర్యాపేట జిల్లా:వరుస దొంగతనాలతో హుజూర్ నగర్ బేజార్ అవుతుంది.ఈ మధ్యనే హుజూర్ నగర్ లో పలుచోట్ల,ఇదే మండలంలోని బూరుగడ్డలో ఓ ఆలయంలో నగలు అపహరణకు గురయ్యాయి.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త బస్టాండ్ సమీపంలోని 3వ వార్డులో ఎన్జీవోస్ కాలనీలో బుధవారం ఓ ఇంట్లో దొంగలు పడ్డారనే విషయం వెలుగుచూసింది.80 వేల నగదు, రెండు తులాల బంగారం అపహరణకు గురి అయినట్లు సమాచారం.ఎన్జీవోస్ కాలనీకి చెందిన నల్లమాల సుబ్బారావు కుటుంబసభ్యులు ఖమ్మంలో శుభకార్యంకు వెళ్ళినట్లు సమాచారం.నేడు ఇంటికి వచ్చి చూడగా రెండు గదుల తలుపులు పగల కొట్టారని,ఇంట్లో ఉన్న 80 వేల నగదు,రెండు తులాల నగలు అపహరణ చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం .ఈ ఘటనపై ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.




Latest Suryapet News