సూర్యాపేట జిల్లా:పేదల భూములు లాక్కోవద్దని,ఆ భూములే వారికి జీవనాధారమని భూముల పరిశీలనకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ హేమంత్ పాటిల్ కాళ్ళు పట్టుకొని వేపూరి సుధీర్ అనే యువకుడు ప్రాధేయపడ్డ సంఘటన మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.నడిగూడెం మండల కేంద్రంతో పాటు,పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఏళ్ల తరబడి ఎస్సీ,బీసీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన పేదలు సేద్యం చేసుకుని పొట్ట పోసుకుంటున్నారని,ప్రభుత్వ పథకాల పేరుతో పేదల బతుకుదెరువైన భూములను లాక్కోవద్దని జాయింట్ కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడడం పలువురిని ఆలోచింపజేసింది.







