సూర్యాపేట మెడికల్ కళాశాలకు 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల మంజూరు...!

సూర్యాపేట:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు( Govt Medical College) కొత్తగా 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఏక కాలంలో ఇంత మందిని నియమించడం ద్వార వైద్య రంగంలో నూతనాధ్యాయం సృష్టించినట్లైంది.

 Grant Of 45 Assistant Professors To Suryapet Medical College...!-TeluguStop.com

జనరల్ మెడిసిన్(5),జనరల్ సర్జన్(7),ఆర్థోపెడిక్(3), పిడియాట్రిక్(5),ఈఎన్టి (1),ఓబిజీ(8),అనస్థీషియా (7),అనాటమీ(1), పథాలజీ(2),మైక్రో బయాలజీ(1),ఫోరెన్సిక్ మెడిసిన్(1),రేడియో డయాగ్నిస్ (3),ఆప్తాల్ (1),కమ్యూనిటీ మెడిసిన్ (1) విభాగాలకు కలిపి నియామకాలు జరుగుతాయి.రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాససభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పేద ప్రజలకు వైద్య సేవల విస్తరణకు ఈ నియామకాలు దోహదపడతాయి.

ముఖ్యమంత్రి కేసీఅర్( CM KCR ) కు ధన్యవాదాలుఇదిలా ఉండగా ఏకకాలంలో సూర్యాపేట మెడికల్ కళాశాలకు 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఅర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా సహచర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రిగా కేసీఅర్ అధికారంలోకి వచ్చాక విద్య,వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు ఈ నియామకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాల వైద్య సేవల విస్తరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ఖచ్చితంగా దోహద పడుతుందన్నారు.పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకీ తేవడమే కాకుండా అందుకు అనుగుణంగా నియామకాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఅర్ సామాన్యుడిపై ఉన్న ప్రేమ ను మరోమారు చాటుకున్నారని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube