సూర్యాపేట జిల్లా:డీడీలు తీస్తే గొర్రెలు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ గొర్రెల,మేకల పెంపకదార్ల సంఘం జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ గొర్రెల,మేకల పెంపకదార్ల సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు.
అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కడెం లింగయ్య,జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారూ మీరు చెప్పారని నమ్మి గొల్ల,కురుమలు డీడీలు తీసి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ మొదటి విడత పంపిణీ చేయని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.ఇప్పుడు మళ్లీ డీడీలు తియ్యాలని అంటున్నారని,2017 లో హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయింది.
ఇంకా ఎదురు చూపే మిగిలింది.ముందు మొదటి విడత గొర్రెల పంపిణీ పూర్తి చెయ్యాలని డిమాండ్ చేశారు.
డీడీలు తియ్యాలని కాల వ్యవధి పెట్టిన అధికారులు గొర్రెల పంపిణీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో చేస్తామని ప్రకటించాలని అన్నారు.లబ్దిదారులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నగదు బదిలీ అమలు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పశువులకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది లేరని,జీవాలకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని,జీవాలకు టీకాలు మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాకేష్ కన్నెబోయిన,సైదులు మద్దెల,లింగయ్య, సాంబయ్య,కంచుగొట్ల శ్రీనివాస్,బోరా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.