సూర్యాపేట జిల్లా:తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో హైదారాబాద్ నుండి విజయవాడ,ఖమ్మం వెళ్లే వాహనాలకు సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించి,
ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు.ఈ జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది భక్తులు,ప్రజలు హాజరవు కావడంతో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.