భారీగా నల్ల బెల్లం, పట్టిక 10 లీటర్ల నాటు సారా పట్టివేత

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజక వర్గంలోని నూతనకల్ మండలం బక్కహేమ్లా తండా గ్రామపంచాయతీ ఆవాసం బోటికింద తండాలో అబ్కారీ శాఖ సీఐ బాలోజి నాయక్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.తండాకు చెందిన గుగులోతు రాములుకు చెందిన వ్యవసాయ భూమిలో నాటు సారా తయారు చేయడానికి నిల్వ ఉంచిన 1350 కిలోల బెల్లం,50 కిలోల పట్టిక,10 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు.

 Heavy Black Jaggery 10 Liters Natu Sara Caught In Nootanakal Mandal, Black Jagge-TeluguStop.com

వీటిని పాతులోతు రెడ్యా డంపు చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని,

దీనిపై పూర్తి విచారణ జరిపి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని ఆబ్కారీ శాఖ సీఐ బాలోజి నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా నాటు సారా తయారు చేయడానికి ప్రయత్నించినా,తయారు చేసినా, నాటు సారాని సరఫరా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్సై గణేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube