సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండలం పాతసూర్యాపేట పరిధిలోని వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ యజమాని వెంకటరమణ మద్యం మత్తులో అందులో పని చేసే బీహార్ కు చెందిన వలస కూలీ కూతురిపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూర్(ఎస్) మండల ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పరిస్థితిని పరిశీలించారు.
బతుకుదెరువు కోసం వచ్చిన వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఇటుక బట్టి యజమాని వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.