సఖీ సెంటర్లో నిర్వహకుని 'సుఖ' నిద్ర

సూర్యాపేట జిల్లా:ఆపద సమయంలో మహిళలకు చేయూతనిస్తూ ఆశ్రయం కల్పించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సఖీ కేంద్రం విమర్శలకు నిలయాలుగా మారిందని తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్జీవోల ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు భరోసా కల్పించడం కోసం సఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 Manager 'sukha' Sleep At Sakhi Center-TeluguStop.com

అయితే పూర్తిగా ఎన్జీవో సంస్థల పర్యవేక్షణలో నడుస్తుండటంతో భరోసా ఇవ్వాల్సిన కేంద్రంలో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు,ఇష్టానుసారంగా సఖీ కేంద్రం నిర్వహణ సాగుతుందనే విమర్శలు వినపడుతున్నాయి.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ఉన్న సఖీ కేంద్రం ఎన్జీవో వెంకట్ రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తుంది.

సఖీ కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాడని, వస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారని బహిరంగ విమర్శలు ఉన్నాయి.సఖీ కేంద్రంలో కేవలం మహిళా సిబ్బందే ఉండటంతో వారితో డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతాడానే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.

ఆ ఆరోపణలకు ఆధారం లేకపోవడంతో ఆయన ఆడిందే ఆటగా సాగుతుందనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.అంతే కాకుండా రాత్రి వేళల్లో వెంకట్ రెడ్డి సఖీ కేంద్రంలో నిద్రించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సోమవారం రాత్రి సఖీ కేంద్రంలో సదరు వెంకట్ రెడ్డి ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో 100 సిబ్బంది రాత్రి 12 గంటలకు సఖీ కేంద్రాన్ని తనిఖీ చేయగా వెంకట్ రెడ్డి అక్కడే ఉన్నట్లు,పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసినట్లు సమాచారం.సఖీ కేంద్రం నిబంధనల మేరకు పురుషులు రాత్రి సమయంలో ఉండటం నిషేధం.

కేంద్ర నిర్వహకులైనా ఇతరులైన రాత్రి సమయాల్లో పురుషులు ప్రవేశించకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.అయినప్పటికీ వెంకట్ రెడ్డి తరచూ కేంద్రంలో నిద్రించడంపై అనుమానాలు బలపడుతున్నాయి.

కేంద్రంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే ప్రత్యేకించి వెంకట్ రెడ్డి తరచుగా ఇక్కడ బస చేస్తాడని తరచూ గుసగుసలు వినపడుతున్నాయి.అతనిపై వచ్చిన,వస్తున్న ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారో,ఏయే అంశాలను నిగ్గుతేలుస్తారో వేచి చూడాలి మరి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube