సూర్యాపేట జిల్లా:శాంతి భద్రతల పరిరక్షణలో సీసీటీవి కెమెరాల పాత్ర చాలా కీలకం.ఒక్క సీసీటీవి వందమంది పోలీసులతో సమానం.
అయితే ప్రస్తుతం పెన్ పహాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం నిఘా కళ్లకు నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి.నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామ మాత్రంగా ఉన్నాయి.
గతంలో ఎస్ఐ మండల కేంద్రంలో,పలు గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా లేక అవి పని చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.
దీంతో నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం సమస్యగా మారిందని,నేరస్థులు కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విచ్చలవిడిగా దొంగతనాలకు తెగపడుతున్నారని అంటున్నారు.ఇటీవల దొంగతనాలు ఎక్కువ అవడంతో నిఘా వ్యవస్థ లోపం వలన నిందితులను పట్టుకోలేకపోతున్నారు.
ఇప్పటికైనా మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలు పని చేసే విధంగా చూసి,నేరాలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.