సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన సరోజన (42) అనే మహిళకు హస్పటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసి అండాశయం వద్ద ఉన్న 7 కిలోల కణితిని తొలగించారు.
గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని విష్ణు జనరల్ ల్యాప్రోస్కోపిక్ హాస్పటల్ లో చేరింది.
డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేయగా అండాశయం వద్ద 7 కిలోల కణితి ఉన్నట్లుగా గుర్తించారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య స్థితి బాగానే ఉన్నట్లుగా డాక్టర్ అనంతు విష్ణువర్ధన్ గౌడ్ తెలిపారు.







