సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నర్సయ్య, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహారావు( Narsimha Rao ), సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ వీరయ్య మరియు పలు వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లలతో పాటు బీఆర్‌ఎస్ మరియు టీడీపీ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు,యువకులు దాదాపు 250 మంది బీఆర్‌ఎస్ మరియు టీడీపీ( TDP ) పార్టీలను వీడి సోమవారం కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి రెడ్డి,( Uttam Padmavathi reddy )మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.







