సూర్యాపేట జిల్లా:పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని గణపతి పూజలో మట్టి విగ్రహాలనే వాడాలని శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్త,ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మిర్యాల శివకుమార్ అన్నారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం వద్ద పట్టణ ప్రజలకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.మట్టిలోని మహిమాన్వితం ఉందని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో బంకమట్టితో తయారుచేసిన విగ్రహాలని పూజించాలని కోరారు.
గత కొద్ది సంవత్సరాలుగా బంకమట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్, కోశాధికారి గుడిపాటి రమేష్ పాల్గొని స్ధానికులకు గణేష్ మట్డి విగ్రహాల పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కమిటీ సభ్యులు నరేంద్రుని విద్యాసాగర్ రావు,తాళ్లపల్లి రామయ్య,నూక వెంకటేశం గుప్త,గుండా శ్రీధర్, ఇల్లందుల జగన్,కర్నాటి శేఖర్,బెలీదే అంజయ్య, చల్లా సోమయ్య,ఈగ విజయలక్ష్మి,మిర్యాల కవిత, ఉప్పల మంజుల తదితరులు పాల్గొన్నారు.