సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె( Penchikal dinne ) గ్రామ ఊర చెరువు చుట్టు ప్రక్కల భూముల వారు చెరువును ఆక్రమిస్తున్నారని ఎఫ్ఎంసిఎస్ బాధ్యులు ఇంజమూరు వెంకటయ్య( Injamuru Venkataiah ) అన్నారు.ఊర చెరువు సొసైటీ సభ్యులతో కలిసి ఆక్రమణకు గురైన స్థలాన్ని సందర్శించిన అనంతరంఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 291 యొక్క మొత్తం విస్తీర్ణాన్ని సర్వే జరిపి చెరువు హద్దులు నినర్ణయించి,చుట్టూ కట్టవేయించి ఆక్రమణ నుండి కాపాడాలని,గత సంవత్సరం మండల తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నా,నేటికీ సర్వే చేయలేదని,చెరువు విస్తీర్ణాన్ని అన్యాక్రాంతం నుండి కాపాడలేక పోయారని వాపోయారు.
చెరువు పక్కన భూములు ఉన్నవారు చెరువును అక్రమిస్తుంటే చెరువుపై ఆధారపడి జీవించే పేద మత్స్యకారులకు నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.చెరువు కబ్జాలకు గురవుతుందని ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువు విస్తీర్ణం తగ్గడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గి, చెరువు నీటితో వ్యవసాయం చేసే పేద రైతులకు పారుదల తగ్గి పంటలకు నీరు సరిపోవడౕం లేనందున పంటలు దెబ్బతిని నష్టపోవడమేగాక,పేద మత్స్యకారులకు చేపల సంపద పెంపకం కూడా తగ్గే అవకాశం ఉందని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమగ్రమైన సర్వే జరిపి, కబ్జాలకు గురైన చెరువు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలనిడిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు యామగాని లచ్చయ్య గౌడ్, యామగాని రాంబాబు( Yamagani Rambabu ),(వెంకన్న)గౌడ్,గజగంటి శ్రీను,యడవెల్లి వెంకట కృష్ణ,సిద్దపంగ సోమయ్య, కోడిరెక్క వెంకటి తదితరులు పాల్గొన్నారు.