సూర్యాపేట జిల్లా:రెండవ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని వేగవంతం చేసి గొర్రెల మేకల పెంపకం దారులను ఆదుకోవాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రెల కొనుగోలు కోసం వెళ్లే గొర్రెల మేకల పెంపకం దారులు రోజుల తరబడి పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh )లో 10 నుండి 15 రోజుల వరకు అక్కడే ఉంటూ,పెట్రోల్ బంకుల్లో పడుకుంటూ రోడ్లమీద దొరికింది తింటూ పడరాని పాట్ల పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యకరమైన గొర్రెలు దొరకక పోవడంతో తిరిగి వేసారి అనారోగ్యంతో ఉండే గొర్రెలను తెచ్చుకోవడం మూలంగా మార్గమధ్యంలోనే మృతి చెందడంతో పెంపకం దారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యాదవులపై ఏ మాత్రం ప్రేమ,చిత్తశుద్ధి ఉన్నా గొర్రెలు ఇవ్వకుండా నగదు బదిలీ చేపట్టాలని కోరారు.
బీసీ రుణాలు,దళితబంధు లాగా యాదవులకు నగదు బదిలీ చేపట్టి అకౌంట్స్ లో జమ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.ఇతర కులాల వారికి ప్రభుత్వం ఇస్తున్న నగదు బదిలీని గొర్రెల పెంపకం దారులకు వర్తింప చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కడారి లింగయ్య,జిల్లా సహాయ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్,గోపనబోయిన రవి యాదవ్,బొల్లం సంజీవ యాదవ్, గురువయ్య పాల్గొన్నారు.