తెలంగాణ ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ (Tamilasai Soundara Raajan) ఆమోద ముద్ర వేయడం లేదని గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.దీంతో రాజ్ భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు.
ఈ తరుణంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజ్ భవన్ ( Rajbhavan ) లోకి ఒక పదిమంది ఆర్టీసీ నేతలను అనుమతించి ఆమెతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ తరుణంలో ఆమె బిల్లును ఎందుకు పాస్ చేయడం లేదో దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటో కార్మికులకు వివరించారు.
ఒకవేళ బిల్లు వేగంగా పాస్ చేస్తే నష్టపోయేది ఆర్టీసీ కార్మికులే అని, కార్మికులకు భవిష్యత్తు భరోసా ఇవ్వకుండా బిల్లు ఎలా ఆమోదముద్ర వేయాలని గవర్నర్ తమిళసై కోరినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ( Rtc ) కార్మికులకు సంబంధించిన ఇష్యులపై గవర్నర్ కు గత రెండు రోజుల నుంచి మెయిల్ ద్వారా మెసేజెస్ పెట్టారని వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు కలగకుండా చూసిన తర్వాతనే బిల్లుకు ఆమోదం తెలుపుతానని గవర్నర్ తమిళసై ఆర్టీసీ కార్మికులతో అన్నట్టు తెలుస్తోంది.ఇంతకీ ఆమె కార్మికుల పక్షాన కోరిన వివరములు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

.#1.1958 నుండి ఆర్టీసీలో కేంద్రానికి సంబంధించి లోన్లు, వాటాలు ఇతర సహాయక వివరాలు లేవు.#2.విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం రాబోవు రోజుల్లో ఆర్టీసీ స్థితిని ఏ విధంగా మారుస్తారో ఆ వివరాలు కూడా ఆ బిల్లులో పొందుపరచలేదు.#3.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెబుతున్న తెలంగాణ సర్కార్ వారికి ఉన్నటువంటి సమస్యలు అయినటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టం, ఇప్పటివరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలు , ఇతర ప్రయోజనాలు ఇకనుంచి వర్తిస్తాయా లేదా అనేది కూడా ప్రస్తావించలేదని గవర్నర్ అన్నారు.#4.ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్లు ఇస్తారా లేదా.#5.ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల్లో కంట్రోలర్,కండక్టర్ లాంటి తదితర పోస్టులు లేవు.కాబట్టి వారికి ప్రమోషన్లు వారికి ఆర్డర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో న్యాయం చేయాలి.ఈ విధంగా ఈ ఐదు అంశాలను ఆ బిల్లులో పొందుపరచలేదని వీటికి సమాధానం తెలిపితే ఆ బిల్లుకు ఆమోదముద్ర వేస్తానని, ఇవన్నీ అమలు జరిగితేనే ఆర్టీసీ కార్మికులకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని గవర్నర్ తమిళసై (Tamilasai) కార్మికులకు చెప్పినట్టు తెలుస్తోంది.







