సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ వద్ద తమ పట్టా భూములను ప్రభుత్వ డీఈ,తహశీల్దార్ అక్రమంగా పట్టా చేసుసుకొని మోసం చేయడంతో మా భూములు మాకు ఇప్పించాలని శాంతియుతంగా టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్న మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి టెంట్ కూలగొట్టిన పంచాయతీరాజ్ డీఈ కరుణాసాగర్, ఆయన భార్య ఏడిండ్ల పుష్పలతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన పిండిగ వంశస్తులు డిమాండ్ చేశారు.గురువారం స్థానిక నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడాతూ.
ఇటీవల తమ భూములను పంచాయతీరాజ్ కరుణాసాగర్ ఆయన భార్య తహసీల్దార్ పుష్పలతలు అక్రమంగా పట్టా చేసుకోవటంతో గత ఐదు రోజుల క్రితం నూతన కలెక్టరేట్ వద్ద సామరస్యంగా టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ నెల 12 రాత్రి డిఈ కరుణాసాగర్ ఆయన భార్య మరి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు రాళ్లతో టెంట్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి టెంట్ పీకి వేశారని ఆరోపించారు.ఈ విషయం మరుసటి రోజు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
అంతేకాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నూతన పట్టాదారు పాస్ పుస్తకం కలిగివున్నప్పటికీ పిండిగా పాల్ పేరుమీద సర్వే నెంబర్ 311అ/1/1/1 ఉన్న తొమ్మిది గుంటల భూమిని డిఈ తమ్ముడు పిండిగ చంద్రం పేరుమీద అక్రమంగా ఎక్కించారని బాధితులు వాపోయారు.మా భూములు అక్రమంగా పట్టా చేసుకుని మా టెంట్ పై దౌర్జన్యానికి పాల్పడిన కరుణాసాగర్ అతని భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఉన్నతాధికారులు స్పందించి మా భూములు మాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆందోళన వ్యక్తం చేసిన వారిలో పిండికి వంశస్థులు పిండిగా రవీందర్, పిండిగా పాల్, పిండిగా జానయ్య, పిండిగా ఉదయ్ కుమార్,పిండిగ కళావతి,పిండిగా నర్సయ్య ,పిండిగా మణి,కుసునోజు లక్ష్మమ్మ,కుసునోజు జానయ్య,కుసునోజు లక్ష్మయ్య, అయిటిపాముల నాగమ్మ, అయిటిపాముల శోభా,లలిత,కోడి మౌనిక తదితరులు ఉన్నారు.