థైరాయిడ్ ఉన్నవారు ధనియాలు తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

థైరాయిడ్ ఆడ‌వారిలో ఎక్కువ‌గా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.మ‌గ‌వారిలో కూడా థైరాయిడ్ స‌మ‌స్య వ‌స్తుంది.

 Coriander Seeds Reduce Thyroid Problems! Coriander Seeds, Thyroid Problems, Thyr-TeluguStop.com

కానీ, చాలా త‌క్కువ శాతం మందే ఈ వ్యాధి బాధితులు ఉంటారు.అయితే వాస్త‌వానికి మ‌న శ‌రీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అది విడుద‌ల చేసే థైరాక్సిన్, ట్రైయోడోథైరోనిన్ వంటి హార్మోన్లు మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌ని చేసేందుకు తోడ్ప‌డ‌తాయి.థైరాయిడ్ గ్రంధి స‌రిగ్గా ప‌నిచేయ‌కుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్ప‌డుతుంది.

దాంతో హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం స‌మ‌స్య‌లు వ‌స్తాయి.అయితే ఎక్కువ శాతం మందిలో హైపోథైరాయిడిజమే క‌నిపిస్తుంది.థైరాక్సిన్, ట్రైయోడోథైరోనిన్ వంటి హార్మోన్లను తగినంతగా ఉత్పత్తి చేయ‌క‌పోవ‌డ‌మే హైపోథైరాయిడిజమ‌ని అంటారు.ఇక ఈ థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చిందంటే దాంటో పాటుగా అధిక బ‌రువు, హెయిర్ ఫాల్‌, చికాకు, ఒత్తిడి, డిప్రెష‌న్‌, కండరాల నొప్పులు‌, నీరసం, మలబద్ధకం ఇలా స‌మ‌స్య‌లు కూడా చుట్టుస్తాయి.

Telugu Coriander Seeds, Tips, Latest, Thyroid, Thyroid Gland-Telugu Health - త

అందుకే థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.వైద్యుల‌ను సంప్ర‌దించి ఆ వ్యాధికి త‌గిని మందులు వాడాలి.అలాగే కొన్ని కొన్ని ఇంటి చిట్కాల‌ను కూడా ఫాలో అయితే ఈ థైరాయిడ్ గ్రంధి ప‌ని తీరు మెరుగుప‌డేలా చేసుకోవ‌చ్చు.ముఖ్యంగా ధనియాలు థైరాయిడ్ ఉన్న‌వారికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఎన్నో ఔషధ గుణాలు గుణాలు దాగి ఉండే ధ‌నియాలు వంట‌ల‌కు చ‌క్క‌టి రుచితో పాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేయ‌గ‌ల‌దు.

ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వారు ఒక స్పూన్ ధ‌నియాల‌ను ఒక గ్లాస్ వాట‌ర్‌లో రాత్రంత నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవ‌డం లేదా ధ‌నియాల పొడిని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం చేయాలి.

ఇలా చేస్తే ధ‌నియాలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్‌ థైరాయిడ్ గ్రంధి ప‌ని తీరు మెరుగుప‌డేలా చేస్తాయి.మురిము హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube