పెట్రోలు కొరత లేదు.కొంత మేర డీజిల్ కొరత ఏర్పడింది.
పుకార్లను నమ్మొద్దు.-బంక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ.
సూర్యాపేట జిల్లా:పెట్రోలు బంకుల్లో పెట్రోలు కొరత వుందని,5 రోజులు పెట్రోల్ బంకులు బంద్ అంటూ కొందరు చేస్తున్న పుకార్లను నమ్మవద్దని పెట్రోలు బంకుల అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు కొరత లేదని,కొందరు కావాలని చేస్తున్న పుకార్లను నమ్మి పెట్రోలు బంకులకు పరుగులు పెట్టవద్దని వాహనదారులను కోరారు.
వాస్తవానికి కొంతమేరకు డీజిల్ కు మాత్రమే కొరత ఏర్పడిందని, పెట్రోల్ కావాల్సినంత అందుబాటులో వుందన్నారు.పెట్రోల్ బంకులు ప్రతి రోజు యధావిధిగా తెరిచేవుంటాయని తెలిపారు.ఆకతాయిల పుకార్ల వల్ల బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయని చెప్పారు.