సూర్యాపేట జిల్లా:కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు కోదాడ నగరానికి చెందిన ఆర్.ఎం.
మస్తాన్ షరీఫ్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు స్టాటిస్టిక్స్ విభాగంలో డాక్టరేట్ ప్రకటించారు.ప్రస్తుతం ఈయన సనా ఇంజనీరింగ్ కళాశాలలో హెచ్ఐయస్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.”సమ్ కంట్రిబ్యూషన్స్ టు వేరియన్స్ సమ్ థర్డ్ ఆర్డర్ స్లోప్ రొటేటబుల్ డిసైన్స్” అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జి.వి.యస్.ఆర్.ఆంజనేయులు పర్యవేక్షణలో పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించినందుకు గాను డాక్టరేట్ డిగ్రీని ప్రకటించినట్లు యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా ఆర్.యమ్.మస్తాన్ షరీఫ్ కు సనా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ యమ్.డి.నజీరుద్దీన్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గాంధీ,అధ్యాపకులు అభినందించారు.