ఏషియాలోనే ప్రతిష్టాత్మకమైనది పేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్...!

సూర్యాపేట జిల్లా:ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ గురువారం సందర్శించారు.మార్కెట్ లో జరుగుతున్న నిర్మాణ పనులను అయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

 Peta Integrated Market Is The Most Prestigious In Asia , Asia, Engineer Sridhar,-TeluguStop.com

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో నెలలో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జమ్మిగడ్డలోని ఎస్ టి పి ప్లాంట్ ను,పాత వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించామని తెలిపారు.

జమ్మిగడ్డలో ఎస్ టి పి ప్లాంట్ నిర్మాణం పూర్తి అయిందని,అండర్ గ్రౌండ్ వద్ద పైప్ లైన్ వద్ద కనెక్షన్ ఇవ్వాల్సి ఉందన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఏషియాలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు.

ఈ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారాలకు అనుగుణంగా ఫ్లాట్ ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు,పండ్లు, పూలు,మటన్ అన్ని ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు అనుబంధంగా వెజ్,నాన్ వెజ్,ఫ్లవర్ మార్కెట్లతో పాటు క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్లలో ఇది రోల్ మోడల్ గా నిలుస్తుంది అన్నారు.ఆయన వెంట సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి,కోదాడ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,టి యు ఎఫ్ టి డి సి ఎస్ ఎఫ్ వెంకటేశ్వర్లు,ఈఈ పీహెచ్ సత్యనారాయణ,ఈఈ జి.కె.డి ప్రసాద్,డిఈలు సత్యరావు,రమాదేవి, ఏఈలు సుమంత్, కాంట్రాక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube