యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి సంవత్సరం దాటుతున్నా గొర్ల పంపిణీ ఇంకా జరగలేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క( CLP leader Bhatti Vikramarka ) ప్రభుత్వంపై ఫైరయ్యారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బీబీనగర్ మండలం మగ్గంపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా శెట్టి అశోక్( Shetty Ashok ) అనే గొర్ల కాపరి ఎదురొచ్చి గొర్రెల పంపిణీ పథకంలో వచ్చిన గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ రావడం లేదని,ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం ముందే తీసుకున్నారని చెప్పడంతో పై విధంగా స్పందించారు.
అనంతరం సదరు గొర్రెల కాపరి భట్టితో మాట్లడుతూ గొర్రెల పంపిణీ పథకం గొల్ల కురుమలకు ఏమాత్రం ప్రయోజనం లేదని, వెటర్నరీ డాక్టర్లకు,ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు ( sheep )కొనుగోలు చేసే దళారులకు కమిషన్లు దండిగా వస్తున్నాయని చెప్పారు.ఓట్ల రాజకీయం కోసం పెట్టిన ఈ పథకం తమ జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేదని వివరించారు.
మరి కొంత మంది గొర్రెల కోసం డీడీ రూపేనా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి సంవత్సరం దాటుతున్నా గొర్ల పంపిణీ జరగలేదని వాపోయారు.గొర్రెలు,బర్లు కాదని తమ పిల్లలకు ఉచిత విద్య,ఉచిత ఆరోగ్యం అందించే పథకాలు తీసుకురావాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.