34 వేల కోట్లతో సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధి:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా

: గడిచిన తొమ్మిదేళ్లలో 34 వేల కోట్లతో సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ( Telangana State Independence Day ) వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ఆయన ప్రారంభించారు.

 Comprehensive Development Of Suryapet District With 34 Thousand Crores Minister-TeluguStop.com

అంతకు ముందు ఆయన పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్న మాటలు నేడు వాస్తవ రూపం దాల్చాయన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) చూపిన దార్శనికతనేకారణమని కితాబిచ్చారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకీ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రభుత్వం 13.02 శాతానికి పెరిగిందన్నారు.అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 10.02 శాతానికి తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకీ నెట్టినా ఆ కుదుపు నుండి అనతికాలంలోనే తెలంగాణా బయట పడి సుస్థిరంగా ముందుకు సాగుతుంది అంటే అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత మాత్రమే నని తేల్చిచెప్పారు.2017- 18 నుండి 2021-22 సంవత్సరాల మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.08శాతంతో రికార్డ్ సృష్టించిందన్నారు.దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణా అని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది అంటేనే రాష్ట్ర అభివృద్ధి ఎంతటిదో ఉహించుకోవొచ్చన్నారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర వృద్ధి రేటు దేశ వృద్ధి రేటును మించి నమోదు కావడం అంటేనే రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.2014-15 సంవత్సరంలో రాష్ట్ర వాటా దేశ వృద్ధి రేటులో 4.1 శాతం ఉండగా 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగిందన్నారు.దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణాలో ఉండగా దేశ వృద్ధి రేటులో తెలంగాణా భాగస్వామ్యం 4.9 శాతం కావడం యావత్ తెలంగాణా సమాజం గర్వ పడాల్సిన అంశమన్నారు.దేశంలోని 18 రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణా వృద్ధి రేటును సాధిస్తుందన్నారు.2015-16 నుండి 2021-22 వరకు12.06 శాతంతో సగటున వార్షిక వృద్ధి రేటులో తెలంగాణా మూడవ స్థానంలో ఉందంటూ గణాంకాలు వెల్లడించారు.అదే విదంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో 34 వేల కోట్లను సమగ్ర జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.రైతు పక్షపాతిగా పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ సహజంగానే వ్యవసాయం వాటి అనుబంధ సంఘాలకు పెద్ద పీట వేశారని చెప్పారు.40007 కోట్లను వ్యవసాయం, ఉద్యాన వనాభివృద్ధికి వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు.వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నీటిపారుదల,ఆయాకట్ల అభివృద్ధికి2,445.47 కోట్లు,విద్యుత్ శాఖా కు1,558.18 కోట్లు, మిషన్ భగీరథ కు 1,216 కోట్లు,వ్యవసాయ మార్కెటింగ్ శాఖా ద్వారా 22.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

అందులో వ్యవసాయ రంగానికి వాటి అనుబంధ విభాగాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,విద్యా,వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని,విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాలతో తెలంగాణా రాష్ట్రం యావత్ భారత దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు.అదే విదంగా వైద్య ఆరోగ్య శాఖా ద్వారా గడిచిన తొమ్మిదేళ్లలో 984.77 కోట్లు,విద్యాశాఖకు 417.82 కోట్లతో అభివృద్ధి సాధించుకున్నమన్నారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేవలం 6 గురుకులాలు ఉన్న సూర్యాపేట జిల్లాలో రాష్ట్రం ఏర్పాటు తరువాత 19 గురుకులాలు,2 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.అదే విధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ సేవా సహకార అభివృద్ధి సంఘం నుండి339.28 కోట్లు,అదే శాఖా ద్వారా సంక్షేమానికి 138.74 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు.దీనితో పాటుగా గిరిజనాభివృద్ధికి 78.53 కోట్లు ఖర్చు పెట్టగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖా ద్వారా 13.97 కోట్లు,మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 27.13 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.మహిళ,శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధులకు 74.44 కోట్లు,తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావ అనంతరం పురపాలక సంఘాల అభివృద్ధికి 556.57 కోట్లు,పట్టణ పేదరిక నిర్ములనకు 1456.20 కోట్లు,గ్రామీణాభివృద్ధి కి 6180.90 కోట్లను వెచ్చించినట్లు వివరించారు.మొత్తం 34 వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి ఖర్చు చేసి తొమ్మిదేళ్లలో ఘణనీయమైన పురోగతిని నమోదు చేసుకున్న విషయాన్ని యావత్ ప్రజానీకం గుర్తించాలన్నారు.

సూర్యాపేట అభివృద్ధిని సూక్ష్మంగా పరిశీలిస్తే 2014 కు పూర్వం 2014 తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.ఇంతటి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు అధికారుల నిరంతర కృషి ఉందని చెప్పారు.

అంతే గాకుండా శాంతి భద్రతల రంగంలో పోలీసుల పని తీరు భేషుగ్గా ఉందని ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube