సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలోగురువారం సాయంత్రం విద్యార్థులు స్నానాలు చేస్తుండగా పాఠశాలలోని నీటి సంపు గోడ కూలి ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన విద్యార్థులను హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన ఆర్.పవన్ 6వ తరగతి విద్యార్ది మరణించగా,శాలిగౌరారం మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన యశ్వంత్,మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుశాంత్ 5వ తరగతి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఉన్నతాధికారులు ఏరియా ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.నీటి సంపు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు