సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల కోడ్ లో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేయించారు.
ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను ఎత్తివేసినా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించక పోకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగు ఎందుకు తీయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి వివిధ గ్రామాల్లో విగ్రహాలను వేసిన ముసుగులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.