సూర్యాపేట జిల్లా:గ్రామ పంచాయతీలో పని చేసే సిబ్బంది పారిశుద్ధ్య,డ్రైనేజీ, ఇతరత్రా పనులతో పాటు కరెంటు పనులు కూడా చేయడం కత్తి మీద సామేనని కార్మికులు వాపోతున్నారు.
కరెంటు పనులు చేసేటప్పుడు అవగాహన లేక జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.
అయినా నాలుగు నెలల నుండి జీతాలు రాక,విధి నిర్వహణ వదులుకోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.