సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గల బాలికల హాస్టల్ కి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని కోరుతూ పి.డి.
ఎస్.యు ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.అనంతరం పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎర్ర అఖిల్ కుమార్,పుల్లురి సింహాద్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహం కు వున్న ప్రహరీ గోడ కూల్చి 3సంవత్సరాలు గడిచినా దానిని నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని,అంచనా వ్యయంను తెలుసుకొని కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.ప్రహరీ గోడ లేకపోవడం వలన హాస్టల్ పక్కన కొంత మంది ప్రతి రోజు మద్యం, పొగ త్రాగుతూ విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తాన్నారని తెలిపారు.
విద్యార్థినిలు హాస్టల్ బయట చదువు కోవాలంటే భయపడే పరిస్థితి వుందని.విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుందని రాష్ట్ర నలుమూలల నుండి తమ పిల్లలను హాస్టల్ కి పంపిస్తే ఇక్కడ రక్షణలేక ఇబ్బందులకు గరవుతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా మంత్రి,అధికారులు స్పందించి తక్షణమే బాలికల హాస్టల్ కి ప్రహరీ గోడ నిర్మాణం చేసి,హాస్టల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరినట్టు తెలిపారు.