వట్టే జానయ్య యాదవ్ కు కానిస్టేబుల్ అభ్యర్థుల మద్దతు

సూర్యాపేట జిల్లా: ఇటీవల కాలంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలలో జరిగిన అవకతవకల విషయంపై కానిస్టేబుల్ అభ్యర్థులు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ కు మంగళవారం మద్దతు తెలిపారు.అనంతరం వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

 Constable Candidates Support To Bsp Vatte Janaiah Yadav, Constable Candidates, B-TeluguStop.com

నీళ్లు,నిధులు,నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే ఆ నీళ్లు,నిధులు, నియామకాలు ఎటుపోయాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.పది సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడంతో పాటు పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉచిత పథకాల పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు.ఆంధ్రా వాళ్ళను తరిమి కొట్టాలని పేర్కొన్న సీఎం,నేడు ప్రధాన అధికారులుగా ఆంధ్రా వాళ్లకి ప్రాధాన్యత కల్పిస్తున్న కేసీఆర్ ని ప్రజలు నమ్మబోరన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 46 జీవో ద్వారా నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే మంత్రి జగదీష్ రెడ్డి కనీసం దాని గురించి మాట్లాడలేదని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు నిరసనగా 100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు.

విద్యార్థులు,యువత, మేధావులు అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని కోరారు.ఎస్సీ,ఎస్టీ,బీసీలంతా ఏకమై ఏనుగు గుర్తుకు ఓటు వేసే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు యాసం ప్రదీప్, నాయకులు మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి, లింగా నాయక్,మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు మీర్ అక్బర్,సీనియర్ అడ్వకేట్ బాణాల విజయ్, బిఎస్పీ పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ ఎలిజిబెత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube