సూర్యాపేట జిల్లా:తన పట్టా భూమిలో గ్రామ పంచాయితీ ( Gram Panchayat )గూణలు వేయడానికి పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నారని మనస్తాపానికి గురై మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సబ్బు నాగయ్య గౌడ్ అనే రైతు (Farmer )పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికిపాల్పడగా,కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
గ్రామానికి చెందిన సబ్బు నాగయ్య గౌడ్ కు అదే గ్రామంలో మూడు ఎకరాల మూడు కుంటల భూమి ఉంది.ఆ భూమిలో గత కొన్ని రోజులుగా గూణలు వేసేందుకు స్థానిక పంచాయితీ పాలకవర్గం ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాధితుడు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి, తహసిల్దార్ ఫిర్యాదు చేశారు.తహసిల్దార్ కూడా విచారణ చేసి భూమి నాగయ్యదేనని,అక్కడ గూణలు వేయడానికి లేదని తేల్చిచెప్పారు.
అయినా గ్రామపంచాయతీ వారు దౌర్జన్యంగా గూణలు వేసేందుకు మంగళవారం ఉదయం పంచాయతీ పాలకవర్గం అదే స్థలంలో ముగ్గు పోయించి,కంకర తోలి పనులు మొదలు పెట్టడంతో సర్పంచ్ భర్త కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా వినలేదని రైతు భార్య ఆరోపించారు.పాలకవర్గ వినకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారని అన్నారు.
తిరుమలగిరి సర్పంచ్ గోవిందరెడ్డి( Govinda Reddy ) వివరణ కోరగా గ్రామపంచాయతీ ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదు.రైతులందరికీ ఉపయోగపడే విధంగానే పనులు చేపట్టాము.ఇప్పటికైనా గ్రామంలో ఉన్నవారు రోడ్డు పనులు వద్దంటే వదిలేస్తామన్నారు.