సోషల్ మీడియాకు స్పందించిన అధికారి

ప్రభుత్వ భూమి స్వాధీనం.హెచ్చరిక బోర్డు ఏర్పాటు.

 Officer Responding To Social Media-TeluguStop.com

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో ప్రభుత్వ భూమి SY.NO-204 అన్యాక్రాంతం అయినట్లుగా సోషల్ మీడియాలో వార్త రావడంతో రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు.కబ్జాకు గురైన భూమి దగ్గరకు రెవిన్యూ గిర్ధావర్ మరియు గ్రామ సేవకులు సతీష్, రాంబాబులను పంపించారు.

కబ్జా ప్రదేశంపైకి వెళ్లిన అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.ఈ భూమి పైకి ఎవరైనా వచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించినట్లు హుజూర్ నగర్ తహశీల్దార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉదయం వార్త రాగానే సాయంత్రం వరకు సమస్యను క్లియర్ చేసిన తహశీల్దార్,ఇతర రెవిన్యూ సిబ్బంది పని తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube