సోషల్ మీడియాకు స్పందించిన అధికారి

ప్రభుత్వ భూమి స్వాధీనం.హెచ్చరిక బోర్డు ఏర్పాటు.

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో ప్రభుత్వ భూమి SY.

NO-204 అన్యాక్రాంతం అయినట్లుగా సోషల్ మీడియాలో వార్త రావడంతో రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు.

కబ్జాకు గురైన భూమి దగ్గరకు రెవిన్యూ గిర్ధావర్ మరియు గ్రామ సేవకులు సతీష్, రాంబాబులను పంపించారు.

కబ్జా ప్రదేశంపైకి వెళ్లిన అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.

ఈ భూమి పైకి ఎవరైనా వచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించినట్లు హుజూర్ నగర్ తహశీల్దార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉదయం వార్త రాగానే సాయంత్రం వరకు సమస్యను క్లియర్ చేసిన తహశీల్దార్,ఇతర రెవిన్యూ సిబ్బంది పని తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్…